ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ 2023 ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?

by Vinod kumar |
ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ 2023 ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్‌కప్‌ 2023 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ సెప్టెంబర్‌ 22న ప్రకటించింది. ఐసీసీ ఈసారి భారీ ప్రైజ్‌మనీని ప్రకటించింది. మొత్తం ప్రైజ్‌మనీ రికార్డు స్థాయిలో 10 మిలియన్‌ యూఎస్‌ డాలర్లుగా నిర్ణయించబడింది. ఇండియన్‌ కరెన్సీలో దీని విలువ దాదాపు 83 కోట్లు (82 కోట్ల 93 లక్షల 57 వేల 500 రూపాయలు). ఈ మొత్తం ప్రైజ్‌మనీ విజేత, రన్నరప్‌, సెమీ ఫైనలిస్ట్‌లు, గ్రూప్‌ స్టేజ్‌లో నిష్క్రమించిన జట్ల మధ్య విభజించబడుతుంది.

వరల్డ్‌ కప్‌ విజేతకు 40 లక్షల యూఎస్‌ డాలర్లు (33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) దక్కుతుంది. రన్నరప్‌కు 20 లక్షల యూఎస్‌ డాలర్లు (16 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలు) అందుతుంది. సెమీ ఫైనలిస్ట్‌లకు 8 లక్షల యూఎస్‌ డాలర్లు (6 కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు).. గ్రూప్‌ స్టేజీలో నిష్క్రమించిన జట్లకు లక్ష యూఎస్‌ డాలరు​(82 లక్షల 92 వేల 950 రూపాయలు).. గ్రూప్‌ స్టేజీలో మ్యాచ్‌ గెలిచిన జట్టుకు 40 వేల యూఎస్‌ డాలర్లు (33 లక్షల 17 వేల 668 రూపాయలు) ప్రైజ్‌మనీగా అం​దుతుంది. ఐసీసీ వన్డే ప్రపం​చకప్‌-2023 భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్‌ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్‌ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది.

Next Story

Most Viewed