వరల్డ్‌కప్ ఫైనల్‌‌ మ్యాచ్‌‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రామ్ చరణ్, రజనీకాంత్

by GSrikanth |
వరల్డ్‌కప్ ఫైనల్‌‌ మ్యాచ్‌‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రామ్ చరణ్, రజనీకాంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫైనల్స్‌ కావడంతో క్రికెట్‌ అభిమానులే కాదు.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ మ్యాచ్‌కు స్వయంగా హాజరై వీక్షించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ విజేత టైటిల్‌ కోసం జరిగే ఈ పోరును వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మోడీతో పాటూ క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవుతారని సమాచారం. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, రామ్ చరణ్, నాగార్జున, వెంకటేశ్, మమ్ముట్టి, కమల్ హాసన్‌లు హాజరు కానున్నారు.

Next Story