అత్యంత వెచ్చని సంవత్సరంగా ‘2021’.. వందేళ్లలో ఐదోసారి ఇలా..

33
2021

న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత వెచ్చని సంవత్సరంగా ‘2021’ నిలిచింది. దేశంలో వార్షిక సగటు ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2021లో 0.44 డిగ్రీల టెంపరేచర్ అధికంగా నమోదైనట్టు భారత వాతావరణశాఖ శుక్రవారం వెల్లడించింది. ‘1901 నుంచి 2016, 2009, 2017, 2010 తర్వాత 2021 సంవత్సరం ఐదో వెచ్చని ఏడాదిగా నిలిచింది. సాధారణం కన్నా 0.44 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది’ అని వార్షిక నివేదికలో పేర్కొంది. అలాగే, గతేడాదిలో వరదలు, తుఫానులు, భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు వంటి విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా దేశంలో 1,750 మరణాలు సంభవించాయని తెలిపింది. కాగా, 2016లో సాధారణం కన్నా 0.710 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవగా, 2009లో 0.550, 2017లో 0.540, 2010లో 0.539డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది.