సీన్ రిపీట్: నాడు కేసీఆర్… నేడు ఈటల

by  |
సీన్ రిపీట్: నాడు కేసీఆర్… నేడు ఈటల
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: దశాబ్దంన్నర తరువాత ఓ సీన్ రిపీట్ అయింది. అది ఉద్యమ పార్టీకి చెందిన నాయకుల్లోనే కావడం గమనార్హం. 2004లో కరీంనగర్ ఎంపీగా గెలిచిన కేసీఆర్ కేంద్రంలో మొదట పోర్ట్స్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన యూపీఏ మిత్ర పక్ష పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు సముద్రమే లేని తెలంగాణ ఎంపీకి పోర్ట్స్ మినిస్టర్ గా ఎలా ఇచ్చారంటూ వ్యాఖ్యానించింది. దీంతో అప్పుడు కేసీఆర్ తనకు ఆ పోర్టుల మంత్రిత్వ శాఖ వద్దని యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీకి చెప్పారు.

దీంతో అప్పుడు కొద్ది రోజులు పోర్ట్ పోలియో లేని మంత్రిగానే కొనసాగారు. ఆ తరువాత కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ వ్యవహరించారు. ఇప్పుడు ఆ సీన్రి పీట్ అయింది. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పోర్ట్ పోలియోను తనకు బదిలీ చేయాలంటూ గవర్నర్ కు లేఖ రాశారు సీఎం కేసీఆర్. దీంతో గవర్నర్ కూడా ఈటల పోర్ట్ పోలియోను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పుడు కేసీఆర్ తనకు కెటాయించిన శాఖను వద్దని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆయనే ఈటల రాజేందర్ పోర్ట్ పోలియోను తనకు బదిలీ చేయించుకున్నారు. దీంతో ప్రస్తుతం మంత్రి ఈటల పోర్టు పోలియే లేని మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

Next Story