కరోనా గుప్పిట్లో బాక్సర్లు.. 20 మందికి పాజిటివ్

106
boxing

పాటియాల: నేషనల్ బాక్సింగ్ శిక్షణా శిబిరంలో క్రీడాకారులు వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మరో 8 మంది బాక్సర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య మొత్తంగా 26కు చేరుకుంది. గురువారం పాటియాలలోని ఎన్‌ఐఎస్‌లో పురుషుల జాతీయ బాక్సింగ్ శిక్షణా శిబిరంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ అని తేలగా వారికి తేలికపాటి లక్షణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 26 పాజిటివ్ కేసుల్లో 20 మంది బాక్సర్లు ఉండగా.. 6 గురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.

తాజాగా కరోనా సోకిన వారిలో ఇద్దరు ప్రధాన బాక్సర్లు సుమిత్, రోహిత్ మోర్ ఉండగా.. మరో ఆరుగురు స్పారింగ్ భాగస్వాములు ఉన్నారు. కొవిడ్ బారిన పడిన వారిలో ప్రధాన కోచ్ నరేందర్ రాణా, కోచ్ కో ఆర్డినేటర్ CA కుట్టప్పతో పాటు అసిస్టెంట్ కోచ్ సురంజయ్ సింగ్ ఉన్నారు. ఈ శిబిరంలో టోక్యో ఒలింపియన్లు అమిత్ పంఘల్, వికాస్ క్రిషన్, మనీష్ కౌశిక్, ఆశిష్ చౌదరి, సతీష్ కుమార్ కూడా ఉన్నారు. వారి పేర్లను బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమోదించిన రెండు రోజల్లోనే జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనేందుకు ఐదుగురిని ముందుగా దూరంగా ఉంచారు. వీరికి కొవిడ్ లక్షణాలు ఉన్నాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది.