దసరాకు ప్రత్యేక రైళ్లు

by  |
దసరాకు ప్రత్యేక రైళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా 196 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఈనెల 20 నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ 30వరకు నడుస్తాయన్నారు. ఈ రైళ్లలో జనరల్ కేటగిరిలు ఉండవని, రిజర్వేషన్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు కాకుండా తెలుగురాష్ట్రాల నుంచి కూడా ప్రారంభం అవుతాయన్నారు. కొవిడ్ నిబంధనల మేరకే ప్రయాణికులు నడుచుకోవాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని, రైల్వేస్టేషన్‌లోకి వచ్చే ముందు థర్మల్ స్క్రీనింగ్ జరుగుతుందన్నారు.

Next Story