అలా చేయని పాన్‌కార్డులపై వేటు 

by  |
అలా చేయని పాన్‌కార్డులపై వేటు 
X

దిశ, వెబ్‌డెస్క్: ఆధార్ నంబర్‌తో పాన్ కార్డులను అనుసంధానం చేయాలని కేంద్ర ఆదాయ పన్ను శాఖ(ఐటీ) పలుమార్లు తెలియజేసింది. ఆధార్‌తో అనుసంధానం చేయని 18 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయని, వాటిని గడువు ముగిసేలోగా ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే కఠిన చర్యలను తీసుకోనున్నట్టు ఆ శాఖ తెలిపింది.

మార్చి 31, 2021 లోగా లింక్‌ చేసుకోవాలని, లేదంటే ఆ పాన్ కార్డులను నిర్వీర్యం చేయనున్నట్టు ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఒకటికి మించి ఎక్కువ పాన్‌ కార్డులను ఉపయోగించే వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తం లావాదేవీలు జరిపే వారిని గుర్తించే పనిలో ఉన్నామని ఐటీ అధికారులు వెల్లడించారు. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ లాంటి వాటి ద్వారా జరిగే భారీ లావాదేవీలను గుర్తించి నిఘా పెట్టనున్నట్టు తెలిపారు.

ఈ నేపథ్యంలో స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ద్వారా సంబంధిత వ్యక్తులను గుర్తించనున్నట్టు అధికారులు వివరించారు. గడువు తర్వాత పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయని వారికి మళ్లీ పొడిగించే అవకాశాలు ఉండవని ఆ శాఖ స్పష్టం చేసింది. కాగా… 130 కోట్ల మంది ఉన్న జనాభాలో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని ఇటీవల ప్రధాని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Next Story