శుక్రవారం పంచాంగం (16-04-2021)

by Hamsa |
Panchangam Rasi phalalu
X

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : చవితి మ2.47 తదుపరి పంచమి
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : రోహిణి రా8.38 తదుపరి మృగశిర
యోగం : సౌభాగ్యం మ3.51 తదుపరి శోభన
కరణం : భద్ర/విష్ఠి మ2.47 తదుపరి బవ తె3.39 ఆ తదుపరి బాలువ
వర్జ్యం : ఉ11.48 – 1.34 & రా2.45 – 4.30
దుర్ముహూర్తం : ఉ8.30 – 9.20 & మ12.37 – 1.26
అమృతకాలం : సా5.05 – 6.51
రాహుకాలం : ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం : మ3.00 – 4.30
సూర్యరాశి : మేషం
చంద్రరాశి : వృషభం
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.11

(16-04-2021) రాశి ఫలితాలు

మేషం

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించలేక విమర్శలు ఎదుర్కొంటారు. పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు అధికమౌతాయి.

MESHAM

వృషభం

బంధు మిత్రులతో వివాదాలను పరిష్కరించుకొంటారు అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులు ఉన్నత పదోన్నతులు పొందుతారు ఇతరులకు ధన విషయాలలో మాటఇచ్చేముందు పునరాలోచన చెయ్యడం మంచిది.

VRUSHABHAM

మిధునం

ఆర్థిక ఒడిదుడుకులు నుండి బయటపడతారు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. విలువైన వస్త్ర , ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన ఆహ్వనాలు ఆనందం కలిగిస్తాయి. సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

MITHUNAM

కర్కాటకం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది . ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

KARKATAKAM

సింహం

గృహమున కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అన్ని వైపుల నుండి సమస్యలు ఎదురై చికాకుపెట్టినా అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. బంధువులతో మాటపట్టింపులు తొలగుతాయి.

కన్య

మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ఆదాయ మార్గాలు నిరాశకలిగిస్తాయి. భూ సంభందిత క్రయ విక్రయాలలో స్వల్పలాభాలు అందుతాయి. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సంతానానికి విద్యావకాశాలు దక్కుతాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి.

తుల

గృహములో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహరాలు నిదానంగా పూర్తిచేస్తారు. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు.

వృశ్చికం

దీర్ఘ కాలిక వివాదాలను పరిష్కారంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. స్ధిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

ధనస్సు

సన్నిహితుల నుంచి వివాదాలకు సంభందించి విలువైన సమాచారం సేకరిస్తారు. ఇంటాబయటా నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుకొంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

మకరం

భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో కలిసి గృహమున ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. తెలివిగా వ్యవహరించి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువపెరుగుతుంది. సంతానవిద్యా ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం

వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. చేపట్టిన పనులలో ఒత్తిడులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. నూతన వస్తులాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

మీనం

సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.Next Story

Most Viewed