షాదీ ముబారక్‌కు రూ.150 కోట్లు విడుదల

by  |
షాదీ ముబారక్‌కు రూ.150 కోట్లు విడుదల
X

దిశ, న్యూస్‌బ్యూరో: గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం షాదీ ముబారక్ పథకానికి రూ.150 కోట్లను గురువారం విడుదల చేసింది. ఈ పథకానికి ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌లో రూ.300 కోట్లను కేటాయించింది. తొలి అర్ధ సంవత్సరానికిగాను రూ. 150 కోట్లను విడుదల చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది. మొత్తం రెండు విడతలుగా ఈ నిధులను విడుదల చేయాలని భావించి తొలి విడతగా దీన్ని విడుదల చేసింది. రెండవ విడత మరో మూడు నెలల తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.

Next Story

Most Viewed