ఆర్మీ హెలికాప్టర్లు ఢీ..15 మంది మృతి

15

దిశ, వెబ్‌డెస్క్: అఫ్ఘనిస్తాన్‌లో వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో మంగళవారం రాత్రి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో 15 మంది సైనికులు మరణించారు. కమాండోలను వారి గమ్యస్థానాల్లో వదిలిపెట్టి, తర్వాత గాయపడిన జవాన్లను తరలిస్తున్న సమయంలో హెలికాప్టర్లు ఢీకొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

అయితే, ఈ ఘటనలో 8 మంది మాత్రమే మరణించినట్లు మరో వర్గం చెబుతోంది. ఇదిలాఉండగా, దీనిపై అఫ్ఘన్ రక్షణ శాఖ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.