అనారోగ్యమా.. 15 రోజులు సెలవ్

by  |
అనారోగ్యమా.. 15 రోజులు సెలవ్
X

దిశ, నల్లగొండ: రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అనారోగ్య సమస్యలున్నపోలీసు సిబ్బంది 15 రోజుల పాటు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. సోమవారం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, డీపీఓ సిబ్బంది, హోమ్ గార్డులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. షుగర్, బీపీ, మూత్రపిండాల సమస్యలు, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలున్న పోలీసులుకు కరోనా సోకే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలన్నారు.

డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో అనారోగ్య సమస్యలు ఉన్నవారు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. అనారోగ్య సమస్యలున్న పోలీసులు ఎవరైనా విధి నిర్వహణలో ఉండి కరోనా బారిన పడినట్లుగా తమ దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పోలీసు శాఖలోని అన్ని విభాగాలకు ఇది వరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమయంలో జీతంలో ఎలాంటి కోతలు ఉండవని, అలాంటి వారి ప్రాణాలు కాపాడడం లక్ష్యంగా పెయిడ్ హాలిడేగా పరిగణిస్తున్నామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. సెట్ కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ సి.నర్మద, ఎస్.బి డిఎస్పీ రమణారెడ్డి, సీఐలు ప్రభాకర్ రెడ్డి, సురేష్ కుమార్, రవీందర్, అంజయ్య పాల్గొన్నారు.


Next Story

Most Viewed