ఏపీలో కేసులు 142.. నిర్ధారణ 5

by  |
ఏపీలో కేసులు 142.. నిర్ధారణ 5
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా అనుమానిత 142 మందిని క్వారంటైన్‌లో ఉంచామని, ఐదుగురికి మాత్రం కరోనా నిర్ధారణ అయిందని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ, ఇందులో 130 మందికి కరోనా నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని, మరో ఏడుగురి రిపోర్టులు రావాల్సి ఉందని వివరించారు.

వైద్య, ఆరోగ్య, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి కరోనా నివారణకు కృషి చేస్తున్నారని తెలిపారు. నేడు జనతా కర్ఫ్యూలో పాల్గొన్న వారంతా వారి సేవలను చప్పట్ల ద్వారా సాయంత్రం ఐదు గంటలకు అభినందించాలని సూచించారు. జనతా కర్ఫ్యూతో అంతా అయిపోయిందని భావించవద్దని, ఆ తరువాత కూడా మనిషికీ మనిషికీ మధ్య దూరం పాటించాలని ఆయన సూచించారు.

సీఎం జగన్‌ ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలు వాయిదా వేశామని అన్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం కల్పించే ప్రయత్నాల్లో ఉన్నామని అన్నారు. 50 % మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసేలా ఆదేశాలిచ్చామన్నారు. వైరస్‌ లక్షణాలున్నా లేదా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగినా ఎలా వైద్యం అందించాలన్న దానిపై మాక్‌డ్రిల్స్‌ నిర్వహిస్తున్నామని, ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తామని ఆయన చెప్పారు. ఉగాది నేపథ్యంలో వివిధ దేవాలయాలకు భక్తుల తాకిడి పెరుగుతుందని, అందుకే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు భక్తులను రానివ్వొద్దంటూ లేఖలు రాశామని ఆయన చెప్పారు.

Tags: ap, alla nani, health advisory, work from home, janata curfew

Next Story

Most Viewed