ఒలింపిక్స్ పాల్గొనే ప్రతీ అథ్లెట్‌కు 14 కండోమ్స్.. ఎందుకంటే..?

by  |
ఒలింపిక్స్ పాల్గొనే ప్రతీ అథ్లెట్‌కు 14 కండోమ్స్.. ఎందుకంటే..?
X

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచంలోని అన్ని దేశాల క్రీడాకారులు ఒకే వేదికపై కలుసుకునే అవకాశం కేవలం ఒలింపిక్స్ వల్లే సాధ్యమవుతుంది. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ విశ్వ క్రీడల కోసం 200పైగా దేశాల నుంచి 10 వేలకు పైగా అథ్లెట్లు ఒక దగ్గరకు చేరతారు. కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ మరో 6 వారాల్లో ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు అనేక ఆంక్షల నడుమ ఒలింపిక్స్ విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం ‘ప్లే బుక్’ను రూపొందించారు. 33పేజీల ఈ ప్లే బుక్‌లో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు ఎలా మసలు కోవాలో పొందు పరిచారు. ఇక దీనికి తోడు ప్రతీ అథ్లెట్‌కు 14 కండోమ్స్ ఉచితంగా ఇవ్వబోతున్నారు. కేవలం అథ్లెట్ల కోసమే 1 లక్షా 60 వేల కండోమ్స్ ఉచితంగా పంచనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం తెలిపింది. క్రీడాకారులు తమ టాలెంట్ ప్రదర్శించి విజేతలుగా నిలవడానికి వస్తారు. కానీ వారికి కండోమ్స్ పంచి పక్కదారి పట్టేలా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కానీ గత కొన్నేళ్లుగా ఒలింపిక్స్ సమయంలో అథ్లెట్ల ప్రవర్తనను ప్రత్యక్షంగా చూసిన కొంత మంది సహచర ఆటగాళ్లు, పలు సర్వేలు చేసిన సంస్థలు విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి.

ఒలింపిక్ విలేజ్‌లో బహిరంగ సెక్స్..

ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వచ్చే అథ్లెట్లు, కోచ్‌ల బస కోసం ప్రత్యేకంగా ఒలింపిక్ విలేజ్ నిర్మిస్తుంటారు. పలు అపార్ట్‌మెంట్లు, విల్లాలు ప్రత్యేకంగా ఒలింపిక్స్ కోసమే నిర్వహిస్తారు. విశ్వక్రీడలు జరిగే నాలుగైదు వారాలు క్రీడాకారులందూ ఈ గ్రామంలోనే బస చేస్తారు. అయితే ఇక్కడ ఒలింపిక్స్‌కు తలవంపులు తెచ్చే పనులు జరుగుతున్నట్లు ఐవోసీ ఏనాడో గుర్తించింది. చాలా మంది క్రీడాకారులు శృంగారంలో మునిగి తేలుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అమెరికా తరపున 12 స్వర్ణ పతకాలు గెలిచిన ప్రముఖ స్విమ్మర్ ర్యాన్ లోచే ఒలింపిక్ గ్రామంలో జరిగే మితిమీరిన సెక్స్, అక్రమ సంబంధాల గురించి బయటపెట్టాడు. క్రీడాగ్రామంలో తాత్కాలికంగా బసచేసే అథ్లెట్లలో దాదాపు 75 శాతం మంది సెక్స్‌లో పాల్గొంటారని స్పష్టం చేశాడు. తన సహచర అమెరికన్ అథ్లెట్ బీరక్స్ గ్రీర్ 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌కు వెళ్లినప్పుడు రోజుకు ముగ్గురు మహిళా అథ్లెట్లతో సెక్స్ చేయడం తాను స్వయంగా చూసినట్లు ర్యాన్ లోచే పేర్కొన్నాడు. అతడు మితిమీరిన సెక్స్ చేసి మోకాలికి గాయం అవడంతో జావెలిన్ త్రోలో పాల్గొనలేక పోయినట్లు చెప్పాడు. క్రీడా గ్రామంలోని గడ్డిలో, బాల్కనీల్లో, బిల్డింగ్స్ మధ్య, మెట్లపై, భవనాలపై విచ్చలవిడిగా క్రీడాకారులు శృంగారంలో మునిగి తేలడం తాను చూశానని చెప్పుకొచ్చాడు. ఇక అమెరికా ఫుట్‌బాల్ క్రీడాకారిణి హోప్ సోలో స్వయంగా తానే సెక్స్ చేసినట్లు చెప్పింది. 2008 బీజింగ్ క్రీడల్లో అమెరికా ఫుట్‌బాల్ జట్టు స్వర్ణ పతకం గెలిచిన తర్వాత.. ఒక సెలెబ్రిటీతో కలసి తన రూమ్‌లో శృంగారం జరిపానని స్పష్టం చేసింది.

ఆనాడు ఎయిడ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి..

నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద కంటైన్‌మెంట్ జోన్‌గా తయారవుతున్నది. 80వ దశకంలో ప్రపంచాన్ని ఎయిడ్స్ మహమ్మారి తీవ్రమైన భయాందోళనలో నెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొని.. ఎయిడ్స్‌ను వ్యాపింప చేస్తారేమో అనే అనుమానాలతో 1988 సియోల్ ఒలింపిక్స్‌లో తొలి సారిగా క్రీడాకారులకు కండోమ్స్ పంచిపెట్టారు. అప్పటి నుంచి ప్రతీ ఒలింపిక్స్‌ సమయంలో కండోమ్స్ పంచుతున్నారు. ఐవోసీ అవగాహన కోసం కండోమ్స్ ఇస్తుంటే.. అథ్లెట్లు మాత్రం సెక్స్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫీలవుతున్నారంటా. సిడ్నీ ఒలింపిక్స్ సమయంలో కండోమ్స్ అయిపోయానని అథ్లెట్లు గొడవ చేయడంతో అప్పటికప్పుడు మరో 20 వేల కండోమ్స్ తెచ్చి పంచిపెట్టారు. 2016 రియో ఒలింపిక్స్ సమయంలో 4,50,000 కండోమ్స్ ఉచితంగా పంచారు. ఒక్కో అథ్లెట్‌కు 42 కండోమ్స్ చొప్పున ఇచ్చారు. ఇందులో 1 లక్ష ఫీమేల్ కండోమ్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ సారి 1,60,000 కండోమ్స్ పంచిపెడుతున్నా.. నిర్వాహకులు మాత్రం ఆంక్షలు విధించారు. ఒలింపిక్ విలేజ్‌లో అథ్లెట్లు తప్పని సరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, కౌగిలించుకోవడం, కరచలనం చేయడం నిషేధమని నిర్వాహకులు ప్లే బుక్‌లో పొందుపరిచారు. అథ్లెట్లు సోషల్ డిస్టెన్స్ పాటించ వద్దని చెప్పి ఎందుకు కండోమ్స్ పంచుతున్నారని అథ్లెట్లు ప్రశ్నించగా… కేవలం వాటిని ఎయిడ్స్‌పై అవగాహన కోసమేనని ఐవోసీ చెబుతున్నది. మొత్తానికి ఒలింపిక్స్ అంటే పలు రకాల క్రీడా పోటీలతో పాటు శృంగార పోటీలు కూడా జరుపుతున్నారని పలువురు అథ్లెట్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.


Next Story

Most Viewed