పండుగ పూట ములుగులో విషాదం

169
Electri-poll11

దిశ, ములుగు: శనివారం ములుగు జిల్లా కేంద్రంలో గాలిపటం కోసం విద్యుత్ స్తంభం ఎక్కిన బాలుడు విద్యుత్ షాక్ కి గురైన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా కేంద్రంలోని క్రిష్ణ కాలనీ సమీపంలో గల పొలాల్లో 12 సంవత్సరాల బాలుడు గాలిపటం ఎగరవేస్తుండగా అనుకోకుండా గాలిపటం విద్యుత్ స్తంభానికి చిక్కుకుంది. చిక్కుకున్న గాలిపటాన్ని తీసుకోవడానికి ఆ బాలుడు కరెంటు స్తంభం ఎక్కిన క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. చుట్టుపక్కల వారు సమాచారం అందించడంతో లైన్ మెన్ విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. ఆ తర్వాత బాలుడిని విద్యుత్ స్తంభం పై నుంచి కిందకి తీసుకొచ్చారు. బాలుడి చేతి, ఛాతి భాగంలో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని హుటాహుటిన ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించగా ప్రథమ చికిత్స చేసి అక్కడ నుండి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.