జోకర్‌ని తరిమేసిన గూగుల్

by  |
జోకర్‌ని తరిమేసిన గూగుల్
X

దిశ, వెబ్ డెస్క్: గూగుల్ సంస్థ తన వినియోగదారులకు మరింత భద్రత, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 11 యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్‌లలో ప్రమాదకర జోకర్ మాల్వేర్ వైరస్ ఉండడమే కారణమని చెక్ పాయింట్ అనే సెక్యూరిటీ సొల్యూషన్ సంస్థ తెలిపింది. జోకర్ మాల్వేర్ ఉన్న యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటే, యూజర్ల ప్రమేయం లేకుండానే డేటాలో మార్పులు, చేర్పులు జరుగుతాయని తెలిపింది.

ప్రీమియం సర్వీసులను కూడా తనంత తానుగా సబ్ స్క్రైబ్ చేసుకోగలవని తెలిపింది. అంతేకాదు జోకర్‌ను గుర్తించడం గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్ వ్యవస్థలకు కూడా సాధ్యం కాదని స్పష్టం చేసింది. వినియోగదారులు వారి మొబైల్స్ చెక్ చేసుకుని.. ఒక వేళ ఈ యాప్స్ ఉంటే వాటిని వెంటనే తొలగించాలని సూచించినట్టు సమాచారం.

గూగుల్ తొలగించిన 11 యాప్‌లు ఇవే…

com.imagecompress.android
com.contact.withme.texts
com.hmvoice.friendsms
com.relax.relaxation.androidsms
com.cheery.message.sendsms
com.cheery.message.sendsms
com.peason.lovinglovemessage
com.file.recovefiles
com.LPlocker.lockapps
com.remindme.alr
com.training.memorygame

Next Story