1088 అంబులెన్సులు ప్రారంభం

by  |
1088 అంబులెన్సులు ప్రారంభం
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ చరిత్రలో నూతనధ్యాయానికి నాంది పలికింది. పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ 201 కోట్ల రూపాయలతో 1088 సరికొత్త 108, 104 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి అత్యాధునిక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ సౌకర్యాలతో తయారైన 108, 104 వాహనాలను ప్రారంభించారు. 676 మండలాల్లో మండలానికి మూడు చొప్పున నూతన 108, 104 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. అర్బన్ పరిధిలో అనారోగ్యంపై ఫిర్యాదు అందిన 15 నిమిషాలు, రూరల్ పరిధిలో అనారోగ్యంపై ఫిర్యాదు అందిన 20 నిమిషాలు, ఏజెన్సీ పరిధిలో అనారోగ్యంపై ఫిర్యాదు అందిన 25 నిమిషాల్లో 108 వాహనం చేరుకునేలా టైం మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మూడు రకాలైన 108 వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాలు, 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు, 26 నియోనాటల్ సపోర్ట్ వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.


Next Story

Most Viewed