ఘోర రోడ్డు ప్రమాదం.. రక్తపు మడుగులో వ్యక్తి మృతి

by  |
ఘోర రోడ్డు ప్రమాదం.. రక్తపు మడుగులో వ్యక్తి మృతి
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల ఫ్లై ఓవర్ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అతివేగంతో బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మంచిర్యాల పట్టణానికి చెందిన సిలబోయిన ఆథమ్(17) (బెల్లంపల్లి మిషన్ భగీరథ కాంట్రాక్టర్ కుమారుడు) పట్టణంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాడు.

ఈ నేపథ్యంలో పనుల పరిశీలన చేసేందుకు బైక్‌పై వస్తుండగా అతి వేగంగా వచ్చిన లారీ అతడి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ఘటన స్థలంలోనే ఆథమ్ మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే తాళ్ల గురజాల ఎస్ఐ సమ్మయ్య ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించినట్టు తెలిపారు.

Next Story