తొలి ప్రాధాన్యం పల్లాదే..

by  |
తొలి ప్రాధాన్యం పల్లాదే..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు సాగగా, అన్ని రౌండ్లలోనే పల్లానే హావా కొనసాగించారు. ఏడు రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,10,840 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న83,290 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరామ్‌కు 70,072 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 39,107 ఓట్లు దక్కాయి. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఏడు రౌండ్లలో అధికారులు 3,87,969 ఓట్లను లెక్కించారు. అయితే ఇందులో 3,66,333 ఓట్లు చెల్లుబాటు కాగా, 21,636 ఓట్లు మురిగిపోయాయి.

టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు వచ్చిన ఓట్లు..
మొదటి రౌండ్ : 16130
రెండో రౌండ్ : 15857
మూడో రౌండ్ :15558
నాలుగో రౌండ్ :15897
ఐదో రౌండ్:15671
ఆరో రౌండ్ : 16,204
ఏడు రౌండ్ల మొత్తం ఓట్లు: 110840

స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే?
మొదటి రౌండ్: 12,046
రెండో రౌండ్ :12070
మూడో రౌండ్ :11742
నాలుగో రౌండ్:12146
ఐదో రౌండ్:12560
ఆరో రౌండ్ : 11,910
ఏడు రౌండ్ల మొత్తం: 83,290 ఓట్లు

టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాంకు ఎంతంటే?
మొదటి రౌండ్ : 9080
రెండో రౌండ్ : 9448
మూడో రౌండ్ :11039
నాలుగో రౌండ్: 10048
ఐదో రౌండ్:9585
ఆరో రౌండ్: 10,505
ఏడు రౌండ్ల మొత్తం: 70072

బీజేపీ అభ్యర్థి ప్రేమేంధర్ రెడ్డికి వచ్చిన ఓట్లు
మొదటి రౌండ్ : 6615
రెండో రౌండ్ : 6669
మూడో రౌండ్ : 5320
నాలుగో రౌండ్ : 5099
ఐదో రౌండ్: 5288
ఆరో రౌండ్ : 5237
ఏడు రౌండ్ల మొత్తం: 39107

కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు వచ్చిన ఓట్లు
మొదటి రౌండ్ 4354
రెండో రౌండ్ 3244
మూడో రౌండ్ 4333
నాలుగో రౌండ్:4003
ఐదో రౌండ్:4340
ఆరో రౌండ్ : 3994
ఏడు రౌండ్ల మొత్తం ఓట్లు: 27588

Next Story