చైతు ఇంకో గిఫ్ట్ రెడీ చేస్కో..

by  |
చైతు ఇంకో గిఫ్ట్ రెడీ చేస్కో..
X

దర్శకులు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘లవ్ స్టోరి’. సాయి పల్లవి హీరోయిన్. శుక్రవారం ప్రేమికుల రోజు సందర్భంగా ఏయ్ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ విడుదల చేసింది సినిమా యూనిట్. ఈ వీడియో సాంగ్ ప్రివ్యూకు ఫిదా అయిపోయింది ఇండస్ట్రీ. కింగ్ నాగార్జున, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు ఈ వీడియో గురించి.. ముఖ్యంగా వీడియోలో సాయి పల్లవి ముద్దు పెట్టడంతో చైతు ఇచ్చిన రియాక్షన్ గురించి ప్రశంసలు కురిపించారు. చైతు కెరియర్‌లోనే ది బెస్ట్ యాక్టింగ్‌ను చూపించారంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. సాయి పల్లవి ముద్దుతో చైతు షాకవ్వడం.. వెంటనే రియలైజ్ అవ్వడం.. కన్నీరు కారుస్తూనే హ్యాపీగా ఫీలవడం ఒకే ఫ్రేమ్‌లో చూపిన శేఖర్ కమ్ములకు థాంక్స్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే ప్రివ్యూ రెస్పాన్స్ చూసి చాలా హ్యపీగా ఫీలైన హీరో చైతు డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఖరీదైన గాగుల్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ శేఖర్ పంచుకున్నారు. చైతు నాకు ఈ గిఫ్ట్ చాలా నచ్చింది అంటూనే, టీజర్ విడుదల రోజు మరో గిఫ్ట్‌ రెడీ చేస్కో అంటూ శేఖర్ పోస్ట్ పెట్టాడు. అయితే, మ్యూజికల్ ప్రివ్యూనే అదిరిపోతే, ఇక టీజర్ దుమ్ములేపుతుందనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు డైరెక్టర్.


Next Story

Most Viewed