ఒకే బైక్‌పై ఏకంగా పది మంది యువకులు ప్రయాణం.. షాకింగ్ వీడియో వైరల్

by Hamsa |
ఒకే బైక్‌పై ఏకంగా పది మంది యువకులు ప్రయాణం.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే బైక్ నడుపుతూ ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. అలాగే ఒకే బైక్‌పై ఒక్కరిద్దరు కాకుండా ఎక్కువ మంది ప్రయాణం చేస్తూ పోలీసులకు పట్టుబడి ఫైన్ కడుతున్నారు. అయితే ఇటీవల కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు బైక్‌పై స్టంట్స్ చేస్తూ ప్రాణాలు పొగొట్టుకొట్టుకుంటున్నారు. అయితే పోలీసులు త్రిబుల్ రైడింగ్ చేయొద్దని హెచ్చరించినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా, ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఏకంగా ఒకే బైక్‌పై 10 మంది యువకులు ప్రయాణం చేస్తూ కనిపించారు.

ఏంటి షాక్ అవుతున్నారా? ముగ్గురు కూర్చుంటేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పది మంది కూర్చోవడం ఏంటి అని అనుకుంటున్నారా? మీరు వింటున్నది నిజమే. ఊహకు కూడా అందనంతగా వైరల్ అవుతున్న వీడియోలో ఒకే బైక్‌పై 10 మంది ప్రయాణం చేశారు. అది ఇబ్బంది పడుకుంటూ కాదండి.. నవ్వుతూ సరదాగా ప్రయాణించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అది చూసిన వారు సూపర్ అంటున్నారు. వారు కూర్చోవడం హైలెట్ అని ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎందుకు ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారని హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed