వర్ధన్నపేట అభివృద్ధిని పక్కన పెట్టి భూ కబ్జాలపై దృష్టి పెట్టిన అరూరి.. : కడియం కావ్య

by Disha Web Desk 23 |
వర్ధన్నపేట అభివృద్ధిని పక్కన పెట్టి భూ కబ్జాలపై దృష్టి పెట్టిన అరూరి.. : కడియం కావ్య
X

దిశ,హనుమకొండ టౌన్ : అరూరి రమేష్ వర్ధన్నపేట అభివృద్ధిని పక్కన బెట్టి భూ కబ్జాలపై దృష్టి పెట్టారు అని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డా. కడియం కావ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ ఎర్రగట్టు గుట్ట, కే.ఎల్.ఎన్ కన్వెన్షన్ లో వర్ధన్నపేట శాసన సభ్యులు కె ఆర్ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన హాసన్ పర్తి మండల బూత్ కమిటీల సమావేశంలో స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి తో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డా. కడియం కావ్య పాల్గొన్నారు. డా.కడియం కావ్య మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం అని, పార్లమెంట్ ఎన్నికల్లో బూత్‌ కమిటీ సభ్యులే కీలకం అని అన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ కు ఓటు వేయించే బాధ్యతను తీసుకోవాలి అని , వర్ధన్నపేట అభివృద్ధిని పక్కన బెట్టి భూ కబ్జాలపై దృష్టి పెట్టిన అరూరికి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు అన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీజీపీలో చేరిన అరూరికి మరోసారి బుద్ధి చెప్పాలి అని అన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే మతతత్వం పెరిగిపోతుందని, సామాన్యులు జీవించే పరిస్థితి లేకుండా పోతుంది అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పి, కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలో తీసుకురావాలి అని, మీ ఇంటి బిడ్డగా నిండు మనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలి అని అన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తి అవ్వగానే, శ్రీరాం సాగర్, దేవాదుల కల్వల ద్వారా రెండు పంటలకు సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా అని, మణికొండ డంపింగ్ యార్డ్ తరలింపు విషయంలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అంత అవగాహన లేకుండా నేను మాట్లాడను, జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా అని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలి అంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలి అన్నారు. బిజెపి గత పదేళ్లలో తెలంగాణకు చేసింది ఏమి లేదు అని, తెలంగాణలో బీజేపీ ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది అని అన్నారు.

విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చ లేదు అన్నారు. బీజేపీకి ఓటు వేసి బ్రతుకులను ఆగం చేసుకోవద్దు అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో ఓఆర్ఆర్ చుట్టూ రైతుల భూములను లాక్కున్నాడు, ఎన్నికల అఫిడవిట్ లొనే వందల ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఇల్లులు ఉన్నట్లు తెలుస్తోంది అని అన్నారు. ఈ ఆస్తులు అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి అని, అవినీతి, అక్రమాలు, భూకబ్జాల ద్వారానే వచ్చాయి అని అన్నారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దొమ్మటి సాంబయ్య, పెరుమాండ్ల రామకృష్ణ, స్థానిక కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, బూత్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed