విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పీజీఈసెట్ పరీక్ష వాయిదా

by Satheesh |
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పీజీఈసెట్ పరీక్ష వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో: జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) నిర్వహించే పీజీఈసెట్ 2024 పరీక్షా తేదీలను వాయిదా వేసినట్టు పీజీఈసెట్ 2024 కన్వీనర్ డా. ఏ.అరుణ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పరీక్షలను జూన్ 10 నుండి 13 వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇదివరకు జూన్ 6 నుండి 9 వరకు పరీక్షలు నిర్వహించాలని భావించినా.. చాలా మంది అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, టీఎస్పీఎస్పీ గ్రూప్-1 పరీక్షలకు హాజరవుతున్నందున పరీక్ష తేదీలను మార్చినట్టు తెలిపారు. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు https://pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కన్వీనర్ సూచించారు.

Read More..

గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..TSPSC కీలక ప్రకటన

Next Story

Most Viewed