పేదల పక్షాన పోరాడే పార్టీ సీపీఐనే… మంత్రి ఉత్తమ్ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​

by Disha Web Desk 11 |
పేదల పక్షాన పోరాడే పార్టీ సీపీఐనే… మంత్రి ఉత్తమ్ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​
X

దిశ, హు హుజుర్ నగర్ : ప్రజల పక్షాన పోరాడే పార్టీ సిపిఐ పార్టీనే అని, సిపిఐ పార్టీ సిద్ధాంతాలు నాకు వ్యక్తిగతంగా నచ్చుతాయని సిపిఐ పార్టీ సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ నలమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం హుజుర్ నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్ లో జరిగిన సిపిఐ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జరిగే పార్లమెంటు ఎన్నికల్లో సీపీఐ పార్టీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ సిపిఐ పార్టీలు సహజ మిత్రులు అని పేర్కొన్నారు. బిజెపి పార్టీ గత పది సంవత్సరాల నుండి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని అన్నారు. దేశ రాష్ట్ర కోసం బిజెపి పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవడమే టైం వేస్ట్ అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 104 నుండి 39 కి పడిపోయిందని, ఇప్పటికే ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎన్నికల తర్వాత మరో 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. నా సర్వే ప్రకారం దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ప్రధాని రాహుల్ గాంధీ కాబోతున్నారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి, గన్న చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ,బొమ్మగాని ప్రభాకర్, ఎల్లావుల రాములు, కంబాల శీను, దేవరపు మల్లేశ్వరి, కొప్పోజు సూర్యనారాయణ పాల్గొన్నారు.

Next Story

Most Viewed