వికలాంగుల రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
వికలాంగుల రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో పవర్‌లోకి రాగానే స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఎమ్మెల్సీ మహేష్​ కుమార్ గౌడ్ ప్రకటించారు. బుధవారం గాంధీభవన్ నుంచి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర 2 ప్రారంభమైంది. ఈ యాత్ర అన్ని లోక్ సభ సెగ్మెంట్ లను అనుసంధానిస్తూ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహేష్​ కుమార్ గౌడ్ మాట్లాడుతూ వికలాంగుల హక్కుల చట్టం 2016ని సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు. విద్య, వైద్యంకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రభుత్వ ,ప్రైవేటు భాగస్వామ్యంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. ఆర్టికల్ 15, 16ను సవరించి వికలాంగులు వివక్ష లేకుండా చేస్తామన్నారు.

చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ..విజయ సంకల్ప యాత్ర 2 ద్వారా కాంగ్రెస్ పార్టీ 15 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమన్నారు. గత 10 సంవత్సరాల కాలంగా కేంద్రంలో బీజేపీ ,రాష్ట్రంలో బీ‌ఆర్‌ఎస్ పార్టీలు వికలాంగుల సంక్షేమంపై, హక్కులపై గొడ్డలి మోపాయన్నారు. యాక్ట్ కమిషనర్లను, నేషనల్ ట్రస్ట్ కి చైర్మన్ , బ్యాక్ లాగ్ పోస్టులు నింపకుండా, ఎంపీ లాడ్స్‌లో వికలాంగులు నిధులు ఖర్చు చేయకుండా బీజేపీ, బీఆర్ఎస్‌లు నిర్లక్ష్యం చూపాయన్నారు. ఈ యాత్ర ద్వాయా వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు భరోసా కల్పిస్తూ కాంగ్రెస్ మద్ధతు పెంచుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి అసోసియేట్ అధ్యక్షుడు కోట మల్లికార్జున్ రావ్, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం గ్రేటర్ అద్యక్షుడు దేశగాని సతీష్ గౌడ్, హైద్రాబాద్ అధ్యక్షులు రజినీ తదితరులు పాల్గొన్నారు.



Next Story