బీజేపీ పాలనలో భారంగా మారిన వ్యవసాయం : కోదండరాం

by Disha Web Desk 11 |
బీజేపీ పాలనలో భారంగా మారిన వ్యవసాయం :  కోదండరాం
X

దిశ, సంగారెడ్డి : దేశంలో బీజేపీ పాలనలో వ్యవసాయం భారంగా మారిందని, దీంతో ఆదాయం తగ్గి రైతులకు ఆదాయం లేకుండా చేసిందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండ రామ్ అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలనలో వ్యవసాయ రంగంలో ఆదాయం రెట్టింపు చేస్తామని వారికి వచ్చే ఆదాయం తగ్గించారని, ఎరువులపై సబ్సిడీ తగ్గించి కార్పొరేట్ కు పని చేస్తుందని ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలు పెరిగి జీఎస్టీ భారమై నోట్ల రద్దుతో ఇబ్బందులు పడ్డారన్నారు. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులను, రైతులను పట్టించుకోలేదన్నారు.

కంపెనీలలో ఉద్యోగాలు లేక, సైన్యంలో తాత్కాలిక పోస్టులను ఏర్పాటు చేశారని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. అన్ని వర్గాలను పట్టించుకోని బీజేపీకి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అదే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఆరోపించారు. తెలంగాణ జన సమితి కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతుందని పార్లమెంట్ అభ్యర్థులు మెదక్ అభ్యర్థి నీలంమధుకు, జహీరాబాద్ అభ్యర్థి సురేష్ షేట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జన సమితి జిల్లా అధ్యక్షుడు తుల్జా రెడ్డి, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed