IPL టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు.. స్డేడియం ముట్టడికి పిలుపు

by Disha Web Desk 4 |
IPL టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు.. స్డేడియం ముట్టడికి పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని సాట్ చైర్మన్ శివసేనారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్స్‌ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నదన్నారు. అక్షర స్కూల్ యాజమాన్యం టికెట్స్‌‌ను అక్రమంగా అమ్మకాలు చేస్తుందన్నారు. క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర నిరాశలకు గురి చేసిందని ఫైర్ అయ్యారు. హెచ్‌సీఏ వైఖరిని నిరసిస్తూ గురువారం ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ఉదయం పది గంటలకు ముట్టడిస్తామన్నారు. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ అభిమానులు పెద్ద ఎత్తున రావాలని ఆయన పిలుపునిచ్చారు.



Next Story