మహిళా సంఘాలకు భవనాలు లేకపోవడం నాకే అవమానం : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 23 |
మహిళా సంఘాలకు భవనాలు లేకపోవడం నాకే అవమానం :  యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహిళా సంఘాలకు భవనాలు లేకపోవడం ఎమ్మెల్యే గా నాకే అవమానమని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.జిల్లా కేంద్రంలోని న్యూ మోతీ నగర్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళా సంఘాలకు భవనాలు లేకపోవడంతో ఎక్కడో చెట్ల కింద కూర్చుని మీటింగ్ లు పెట్టుకుంటే మన వ్యవస్థకే సిగ్గుచేటని,అందుకే ప్రతి మహిళా సంఘానికి భవనాలు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదేనని ఆయన హామీ ఇచ్చారు.

కుల మతాలకు అతీతంగా మన జిల్లాను అభివృద్ధి చేసుకొనే అవకాశం 70 సంవత్సరాల తర్వాత జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనకు ఆ అవకాశం లభించిందని,ఆయన మన పార్లమెంటు నియోజకవర్గానికి బాధ్యుడుగా ఉన్నారు కనుక ఆయనకు బాసటగా నిలిచి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి చెయ్యి గుర్తు కే తమ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రికి బహుమతి గా ఇద్దామని ఆయన అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సతీమణి ఆశ్లేష రెడ్డి,ఐఎన్టీయూసీ అధ్యక్షుడు రాములు యాదవ్,కౌన్సిలర్ జాజి మొగ్గ నర్సింహులు,డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ,సుధాకర్ రెడ్డి,విజయ్,చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed