ఎన్నికల నిబంధనలు కఠినంగా పాటించాలి : జిల్లా ఎస్పీ

by Disha Web Desk 23 |
ఎన్నికల నిబంధనలు కఠినంగా పాటించాలి : జిల్లా ఎస్పీ
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: భారత ఎన్నికల కమిషన్ విధించిన పార్లమెంట్ ఎన్నికల నియమ నిబంధనలను కఠినంగా అమలు పరచాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం పోలీస్ సిబ్బందికి నిర్వహించిన ఎన్నికల రివ్యూ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.ఎన్నికల ముందు,పోలింగ్ రోజు,ఎన్నికల తర్వాత, స్ట్రాంగ్ రూం దగ్గర,కౌంటింగ్ రోజు ఇలా అన్ని సమయాల్లో కేంద్ర బలగాలు,మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు సమన్వయంతో కలిసి,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు.

ఓటర్లు భయాందోళనలకు గురి కాకుండా,తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకునేలా భరోసా కల్పించడమే ముఖ్యమని ఆయన అన్నారు.ఎన్నికల రోజు వామపక్ష తీవ్రవాద ప్రాంత,సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో స్టాటిక్,ఫోర్స్ రూట్ బందోబస్తు,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లను అత్యవసర సమయాల్లో వినియోగించుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు.కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ విధులను కూడా నిర్వహించాలని,కీలకమైన పాయింట్ల వద్ద సెంట్రల్ ఫోర్స్ సిబ్బందిని నియమించాలని,చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సమయంలో తగు జాగ్రత్తలను ఆయన సూచించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రాములు,డిఈఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed