‘ఎవడన్నా రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇస్తడా.. కోతలు కోసేటప్పుడు ఇస్తడా?’: రేవంత్ రెడ్డిపై KCR ఫైర్

by Disha Web Desk 9 |
‘ఎవడన్నా రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇస్తడా.. కోతలు కోసేటప్పుడు ఇస్తడా?’: రేవంత్ రెడ్డిపై KCR ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి రేవంత రెడ్డిపై ఘాటు కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఇప్పుడు మర్లవడ్డదన్నారు. రైతుబంధు పోయిన నెల 9 తారీకు లోపల సీఎం రేవంత్ రెడ్డి మొత్తం రైతుల ఖాతాల్లో వేస్తానన్నారు ఏమైందని ప్రశ్నించారు. మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా మరీ? అని రైతుల్ని అడిగారు. ఎవడన్నా రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇస్తడా.. లేకుంటే కోతలు కోసేటప్పుడు ఇస్తడ అని రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంటలు కోసుడు అయిపాయే.. పంట రానే వచ్చే.. ఇప్పుడు జోకుతుండ్రు కూడా అన్నారు. నాటు వేసేటప్పుడు ఇస్తడా? జోకేటప్పుడు ఇస్తడా? అని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అసమర్థ పాలనను ఏమనాలి? అంటూ కేసీఆర్ కాంగ్రెస్ పాలనపై ఫైర్ అయ్యారు.

Read More...

సీఎం రేవంత్ వ్యాఖ్యలు దుమారం! అసలు ఏం అన్నారో తెలుసా?

Next Story

Most Viewed