కేసీఆర్ పాల‌న‌పై ఎమోష‌న‌ల్ సాంగ్ రిలీజ్.. ప్రజలు బాగా కనెక్ట్ అవుతున్నారంట?

by Disha Web Desk 14 |
కేసీఆర్ పాల‌న‌పై ఎమోష‌న‌ల్ సాంగ్ రిలీజ్.. ప్రజలు బాగా కనెక్ట్ అవుతున్నారంట?
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ మరో సాంగ్ విడుదల చేసింది. అయితే ఈ సారి గత కేసీఆర్ పాలన ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేసింది. రాజ్య‌మే తెచ్చినోడు.. ఎన్న‌టికీ ఓడిపోడు అంటూ కేసీఆర్ అభివృద్ధిపై రూపొందించిన సాంగ్ బీఆర్ఎస్ పార్టీ సోమవారం ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ‘కేసీఆర్ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి.. నేడు కేసీఆర్ పాలన లేని లోటును వర్ణిస్తూ రూపొందించిన ఎమోషనల్ సాంగ్’ అని బీఆర్ఎస్ పేర్కొంది. ఈ పాటను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ట్విట్టర్ వేదికగా పార్టీ ట్యాగ్ చేసింది.

కారు గుర్తుకు ఓటు వేయాలని హ్యష్ ట్యాగ్‌తో పాటను విడుదల చేసింది. అయితే, ఈ ఎమోషనల్ సాంగ్ వైరల్ కావడంతో సాంగ్‌కు జ‌నాలు బాగా క‌నెక్ట్ అవుతున్నారు. ఈ సాంగ్‌లో కేసీఆర్ ఉద్యమ నాటి వీడియోలు పంచుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సమస్యల గురించి వివరించారు. కాగా, ఈ పాటకు ప్రముఖ మ్యూజిక్ కల్యాణ్ కీస్, బుల్లెట్ బండి లక్ష్మణ్ లిరిక్స్ రాశారు. ప్రముఖ సింగర్స్ పెంచల్ దాస్, ఉషక్క, బట్టు శైలజ, లక్ష్మణ్ ఈ ఎమోషనల్ సాంగ్‌ను పాడారు.

Click Here For Twitter Post

Next Story

Most Viewed