విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్మికుడు మృతి

by Sridhar Babu |
విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్మికుడు మృతి
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రూరల్ మండలం లింగు గూడ గ్రామపంచాయతీ కార్మికుడు పూసం ఉదయ్ శుక్రవారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సీఐటీయూ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. గత 2 నెలల నుండి వేతనాలు రాకున్నా కార్మికులు

గ్రామ పంచాయతీలో పని చేస్తున్నారని అన్నారు. రోజూ పంచాయతీ కార్యదర్శి గ్రామంలో బల్పులు పెట్టమని చెప్పడంతో ఆ సమయంలో మధ్యాహ్నం ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఇది తెలుసుకున్న మండల ఎంపీఓ, ఎంపీడీవోలు ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చిన కుటుంబానికి భరోసా ఇవ్వకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుని కుటుంబానికి నష్ట పరిహారం 25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను కోరారు. లేనియెడల కుటుంబంతో కలిసి పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు.

Next Story

Most Viewed