క్షణాల్లో క్యాన్సర్, గుండెపోటును గుర్తిస్తున్న AI.. అది ఎలా సాధ్యమంటే?

by Disha Web Desk 8 |
క్షణాల్లో క్యాన్సర్, గుండెపోటును గుర్తిస్తున్న AI.. అది ఎలా సాధ్యమంటే?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పేరే వినిపిస్తుంది. వివిధ రంగాల్లో దీని సేవలకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఏఐ‌ని ఉపయోగించి కష్టతరమైన పనులను కూడా ఈజీగా చేసేస్తున్నారు. తాజాగా ఏఐ వైద్యరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రాణాంతక వ్యాధుల నుంచి రోగులను కాపాడడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుదంటున్నారు నిపుణులు.

ఇది పలు రకాల క్యాన్సర్, గుండెపోటును చాలా సులభంగా గుర్తిస్తుందంట. అది ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి. ఏఐ ద్వారా వైద్యులు డ్రై బ్లడ్ స్పాట్ టెస్ట్ ద్వారా క్యాన్సర్‌ను గుర్తించేందుకు గ్యాడ్జెట్స్‌ను సృష్టించారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి.. రక్తంలోని ప్రోటీన్లు, మైక్రో RNAs పరీక్షిస్తారు.ఇలా పరీక్షించగా 80 శాతం ఖచ్చితమైన రిజల్ట్స్ వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. అలాగే, గుండెపోటు ను గుర్తించే గాడ్జెట్స్ కూడా తయారు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్‌ వంటి సమస్యలను గుర్తించేలా పరికారాలను తీసుకరానున్నారని వారు పేర్కొన్నారు.

Next Story

Most Viewed