పోలింగ్ శాతాలపై ఈసీకి నోటీసులు.. వారం రోజుల్లోగా సమాధానమివ్వాలన్న సుప్రీంకోర్టు

by Shamantha N |
పోలింగ్ శాతాలపై ఈసీకి నోటీసులు.. వారం రోజుల్లోగా సమాధానమివ్వాలన్న సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: పోలింగ్ శాతాలపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీగా ఓటింగ్ శాతాలను వెబ్ సైట్ లో ఉంచాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది. వారంరోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. మే 24న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది.

కేంద్రాల వారీగా పోల్ అయిన ఓట్ల సంఖ్యను పొందుపరిచేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంని ఆశ్రయించింది అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌. లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న ముగిసింది. అయితే ఏప్రిల్ 30న పోల్ అయిన ఓట్ల సంఖ్యను వెబ్ సైట్లో పెట్టారు. ఏప్రిల్ 26న రెండో దశ జరగగా.. నాలుగు రోజుల తర్వాత ఓటింగ్ వివరాలను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచాయి. తొలిదశ పోలింగ్ రోజున ఈసీ తెలిపిన ఓటింగ్ శాతం.. ఏప్రిల్ 30న వెబ్ సైట్ లో ఉంచిన పోలింగ్ శాతంలో తేడాలున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏడీఆర్. ఇందులో భాగంగానే ఈసీకి నోటీసులు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం.

Next Story

Most Viewed