బీజేపీ సీ టీమ్.. మెహబూబా ముఫ్తీ పీడీపీ పార్టీ- ఒమర్ అబ్దుల్లా

by Dishanational6 |
బీజేపీ సీ టీమ్.. మెహబూబా ముఫ్తీ పీడీపీ పార్టీ- ఒమర్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: మెహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)పై ఫైర్ అయ్యారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా. బీజేపీకీ మెహబూబా ముఫ్తీ పార్టీ సీ టీంగా మారిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో మెహబూబా ముఫ్తీకి ఓటు వేయాలని పహారీ కమ్యూనిటీ సభ్యులను కోరారు బీజేపీ నేత ముస్తాక్ బుఖారీ. దీంతో ఒమర్ అబ్దుల్లా పీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా విషం వ్యాపింపజేసే బీజేపీని ఓడించాలంటే ఇండియా కూటమినే గెలిపించాలని కోరారు. జమ్ము కశ్మీర్ లోని ఐదు స్థానాల్లో ఇండియా కూటమి నేతలనే గెలిపించాలని కోరారు. బీజేపీ సి టీంగా పీడీపీ మారిందన్నారు. ఇండియా కూటమి సభ్యులు కాకుండా మిగతా వారందరు ఏదో విధంగా బీజేపీతో కనెక్ట్ అయ్యి ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ముస్తాక్ బుఖారీ ప్రకటనను మార్చుకోవాలని మెహబూబా ముఫ్తీ బీజేపీపై ఒత్తిడి తెస్తారని పేర్కొన్నారు.

లడఖ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జమ్యాంగ్ త్సెరింగ్ గురించి మాట్లాడారు అబ్దుల్లా. ఇండియా కూటమి నుంచి అలాంటి అభ్యర్థినే నిలబెట్టడానికి ప్రయత్నిస్తామన్నారు. దీంతో బీజేపీ గెలిచే అవకాశం ఉండదని అన్నారు. ఇకపోతే, 2019లో జమ్మూ కాశ్మీర్‌లోని ఆరు స్థానాలకు లోక్‌సభకు పోలింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 3 సీట్లు గెలుచుకోగా.. మిగతా మూడు సీట్లు నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకుంది.

జమ్ముకశ్మీర్ లోని ఉధంపూర్ లో ఏప్రిల్ 19న పోలింగ్ జరగగా.. జమ్ము, అనంత్ నాగ్- రాజౌరీ, శ్రీనగర్, బారాముల్లాలో ఏప్రిల్ 26, మే 7, మే13, మే20వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.



Next Story

Most Viewed