ప్రియుడితో పెళ్లికి రెడీ అయిన బుల్లితెర నటి..నిశ్చితార్థం వీడియో షేర్ చేసిన మోనిత..

by Dishafeatures1 |
ప్రియుడితో పెళ్లికి రెడీ అయిన బుల్లితెర నటి..నిశ్చితార్థం వీడియో షేర్ చేసిన మోనిత..
X

దిశ,సినిమా: మా టీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్‌లో విలన్ పాత్రలో మోనితగా మెప్పించిన శోభా శెట్టి.. బిగ్ బాస్ సీజన్-7 తో మరింత క్రేజ్ దక్కించుకుంది. హౌస్‌లో అబ్బాయిలతో సమానంగా ఆడుతూ తన సత్తా చాటింది.. కానీ, ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది.

అయితే హౌస్‌లో ఉండగా తన ప్రేమ విషయం పంచుకొన్నదని మనకు తెలుసు. కార్తీకదీపం సీరియల్‌లో తనతో పాటు నటించిన యశ్వంత్ రెడ్డితో లవ్‌లో ఉన్నానని బాంబ్ పేల్చి్ంది. గతంలో తాంబులాలు అంటూ వీడియో షేర్ చేస్తూ త్వరలోనే పెళ్లి అంటూ హింట్ ఇచ్చేసింది. ఇక బిగ్ బాస్ తర్వాత తన ప్రియుడితో కలిసి కొత్త ప్రయాణం స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే సొంతంగా ఇళ్లు తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు పెళ్లికి రెడీ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది.

ఇక తాజాగా వీరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.నిశ్చితార్థం కోసం ఇలా రెడీ అయ్యానంటూ శోభ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో షేర్ చేసింది. పట్టుచీరలో.. ఒంటినిండా ఆభరణాలతో.. చేతులకు మెహందీ వేసుకుని సంప్రదాయంగా రెడీ అయ్యి మరింత అందంగా కనిపిస్తుంది. నిశ్చితార్థ వేడుకలలో శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డి చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ వేడుకకు వచ్చిన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. శోభా, యశ్వంత్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.

Read More..

విరాట్ కోహ్లీ కంటే అనుష్కా శర్మ అంత పెద్దదా?.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..


Next Story

Most Viewed