అబ్బాయిలతో మందేస్తూ తూలిపోతున్న సుప్రిత.. ఇది నాకు మంచి అనుభూతిని కలిగించిందంటూ పోస్ట్ (వీడియో)

by Disha Web Desk 7 |
అబ్బాయిలతో మందేస్తూ తూలిపోతున్న సుప్రిత.. ఇది నాకు మంచి అనుభూతిని కలిగించిందంటూ పోస్ట్ (వీడియో)
X

దిశ, సినిమా: నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న.. ఈ వయసులో కూడా తన కూతురు సుప్రితతో కలిసి నెట్టింట సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తల్లితో సహా క్రేజ్ తెచ్చుకున్న సుప్రిత ఇప్పుడు హీరోయిన్‌గా కూడా వెండితెర ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రేమ్ అమర్ దీప్ చౌదరి హీరోగా నటిస్తున్న రోమాంటిక్ లవ్ ఎంటర్‌టైన్ మూవీలో సుప్రిత హీరోయిన్‌గా నటిస్తుంది.

ఇక సినిమా అవకాశాలు కూడా రావడంతో సుప్రిత క్రేజ్ మరింత పెరిగిపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందాలతో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటోంది. అంతే కాకుండా అప్పుడప్పుడు వెకేషన్లకు చెక్కేస్తూ వాటికి సబంధించిన ఫొటోలు, వీడియోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా సుప్రిత తన ఫ్రెండ్స్‌తో కలిసి టూర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ వాళ్లు ఎంజాయ్ చేసిన వీడియో షేర్ చేస్తూ.. ‘ఈ ప్రయాణం నాకు చాలా మంచి అనుభూతిని కలిగించింది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ షేర్ చేసిన వీడియోలో వాళ్లు మందేస్తూ తూలుతున్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed