అదంతా కూడా కేవలం సె* కోసమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్!

by Disha Web Desk 8 |
అదంతా కూడా కేవలం సె* కోసమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్!
X

దిశ, సినిమా : స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఈయన సినిమా వస్తుదంటే థియేటర్స్ వద్ద ఆ సందడే వేరే ఉండేది. ఎంతో మంది స్టార్ హీరోస్‌తో సినిమాలు తెరకెక్కించి మంచి గుర్తింపు పొందాడు. కానీ ఈ మధ్య ఈ దర్శకుడికి క్రేజ్ మొత్తం పడిపోయింది. అంతే కాకుండా ఈయనపై చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే పూరీ, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ అందుకోవడంతో, దర్శకుడు చాలా బాధలో మునిగిపోయినట్లు సమచారం. దీంతో ఆయన సినిమాలు చేయాలనే ఆశకూడా వదుకొని,తనకు ఎంతో ఇష్టమైన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనను కూడా వదిలేసినట్లు సమాచారం.

ఇక ఇదంత పక్కన పెడితే ఈ మధ్య పూరీ మ్యూజిక్స్ అనే ఒక ఛానల్ క్రియేట్ చేసి కొన్ని ఆసక్తికర వీడియోలను విడుదల చేస్తూ తన అభిమానులతో ముచ్చటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈయన ఓ ఆసక్తికర వీడియోను రిలీజ్ చేశాడు. ఈ మధ్య యూత్ లవ్ ఫెయిల్యూర్, ప్రేమించిన అమ్మాయి లేకపోతే సూసైడ్ అనే ఆలోచన ధోరణిలో ఉన్నారు. దీంతో ఆయన వీడియోలో.. కొంత మంది ప్రేమించి.. ప్రేమే సర్వస్వం, ప్రేమలేకపోతే సూసైడ్ చేసుకుంటాను అని అంటుంటారు కానీ ఇదంతా ఫేక్.. సెక్స్ కోసం మాత్రమే అలా చేస్తారంటూ చెప్పుకొచ్చాడు.. చాలా మంది తమ జీవితంలో లవ్‌లో ఫెయిల్ అవుతుంటారు. ఆ సమయంలో ఏం తినరు, సరిగ్గా నిద్ర కూడా పోరు..మద్యానికి బానిసైపోతారు.. దీనినే ప్రేమ అనుకుంటారు కానీ, ఇది కాదు ప్రేమ..మీ అమ్మ కంటే నేను ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తారా..? నీ తల్లి కోసం చేతులు కోసుకున్నావా? ఏడ్చావా? అమ్మాయి ప్రేమంతా ఫేక్ నువ్వు కేవలం శృంగారం కోసం మాత్రమే అమ్మాయిలను ప్రేమిస్తావు .. అదంతా మాయ మత్తులో జరుగుతుందంటూ నేటి యువత తప్పుదారి పడుతున్న విధానాన్ని ఆయన తన వీడియో ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక దీంతో కొంత మంది.. పూరీ నిజం చెప్పుకొచ్చావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed