ఎన్టీఆర్ ‘దేవర’ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. గూస్ బంప్స్ ఖాయం

by Hamsa |
ఎన్టీఆర్ ‘దేవర’ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. గూస్ బంప్స్ ఖాయం
X

దిశ, సినిమా: జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో ‘దేవర’ తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులవుతున్నప్పటికీ ‘దేవర’ నుంచి ఎక్కువ అప్డేట్స్ రాలేదు. పోస్టర్, గ్లింప్స్ విడుదలై భారీ అంచనాలు పెంచేశాయి. దీంతో ఎప్పుడు దేవర నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో మేకర్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. బర్త్ డేకు ముందుగానే మే 19న ఫస్ట్ సాంగ్ రాబోతుందని తెలిపారు. తాజాగా, నేడు దేవర సాంగ్ ప్రోమో విడుదల చేసి ఆశ్చర్యపరిచారు. ఇందులో ఎన్టీఆర్ సముద్రం నుంచి పడవలో వస్తున్నట్లు చూపించారు. అందులో ఆయన కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిర్ గూస్ బంప్స్ వచ్చేలా ఉండటంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు అయితే ఫుల్ సాంగ్ మే 19న రాబోతుంది.

Next Story

Most Viewed