కడుపుతో ఉన్న జబర్దస్త్ కమెడియన్ సుజాత.. బేబీ బంప్‌తో ఎంత క్యూట్ ఉందో..

by Dishafeatures3 |
కడుపుతో ఉన్న జబర్దస్త్ కమెడియన్ సుజాత.. బేబీ బంప్‌తో ఎంత క్యూట్ ఉందో..
X

దిశ, సినిమా: జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ను ఇంటర్వ్యూ చేసిన యాంకర్ సుజాత.. అప్పుడే అతనితో లవ్ లో పడిపోయింది. తనతో క్లోజ్ అయిపోయాక.. న్యూస్ రీడర్ గా చేస్తూనే జబర్దస్త్ స్కిట్స్ కూడా చేసింది. మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత 'సేవ్ ది టైగర్స్' సిరీస్ లో అవకాశం దక్కించుకున్న ఆమె.. చాలా సహజంగా నటించిందని ప్రశంసలు అందుకుంది. దీంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ టైంలోనే రాకేష్ ను పెళ్లి చేసుకున్న ఆమె.. రీసెంట్ గా తల్లి కాబోతున్నట్లు శుభవార్త చెప్పింది.

అయితే తాజాగా బయటకు వచ్చిన సుజాతను చూసి.. మురిసిపోతున్నారు అభిమానులు. చక్కగా చీరకట్టుకుని బేబీ బంప్ తో చాలా అందంగా కనిపిస్తుందని అంటున్నారు. ఇతర న్యూస్ రీడర్స్ కొంచెం ఫేం రాగానే మోడ్రన్ గా మారిపోయారని కానీ తను మాత్రం అంతే పద్ధతిగా ఉంటుందని మెచ్చుకుంటున్నారు. త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆమెకు అంతా శుభం జరగాలని ఆశీర్వదిస్తున్నారు.

https://www.youtube.com/shorts/mN0kCn2hmo8

Next Story

Most Viewed