ఇన్ని రోజులకు బట్టబయలైన అసలు రహస్యం.. పవిత్రని నరేష్ ప్రేమించింది అందుకేనా?

by Samataha |
ఇన్ని రోజులకు బట్టబయలైన అసలు రహస్యం.. పవిత్రని నరేష్ ప్రేమించింది అందుకేనా?
X

దిశ, సినిమా : సోషల్ మీడియాలో ట్రెండీ కపుల్స్‌లో ముందు ఉండే జంట ఏదైనా ఉన్నదా అంటే పవిత్ర, నరేష్. ఆ మధ్య సమంతకు మించి వీరు సోషల్ మీడియాను షేక్ చేశారు. పెళ్లి చేసుకోబోతున్నారు, విడాకులు, మళ్లీ పెళ్లి ఇలా వీరికి సంబంధించిన ఎన్నో వార్తలొచ్చాయి. అయితే మరోసారి తాజాగా, వీరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్, చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఈయన కామెడీకి కేరాఫ్ అడ్రాస్‌గా నిలిచారు అప్పట్లో, ఈయన నటించిన సినిమాలు చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక నరేష్ ఇప్పటికీ తన కెరీర్‌ను కొనసాగిస్తూనే వస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు.

అయితే ఈయన పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇక వీరిమధ్య ఉన్న బాండింగ్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. నిజమైన భార్య భర్తల్లా, చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే ఈ వయసులో వీరి మధ్య ఎలా ప్రేమ పుట్టింది. అసలు వీరు అంత క్లోజ్‌గా ఉండటానికి గల కారణం ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ వీరిద్దరి మధ్య ఎమోషనల్ బాండిగ్, ప్రేమ పుట్టడానికి గల అసలు రహస్యాన్ని చెప్పేశారు. ఆయన మాట్లాడుతూ.. మా అమ్మ విజయ నిర్మల పుట్టిన రోజు.. పవిత్ర లోకేష్ పుట్టినరోజు ఒకటే. ఇద్దరి బర్త్ డే ఫిబ్రవరి 20 నే అని నరేష్ తెలిపాడు. ప్రకృతి ఆ విధంగా నాకు సిగ్నల్ పంపింది అంటూ పవిత్ర లోకేష్ తో ప్రేమ గురించి తెలిపాడు. పవిత్ర కూడా మా అమ్మలానే, చాలా మంచిది, స్ట్రాంగ్ వుమెన్. కానీ మా అమ్మ నాతో ఎప్పుడూ నీకు అన్ని ఇచ్చాను కానీ మంచి తోడును ఇవ్వలేకపోయానంటూ చెప్పేది. కానీ పవిత్ర పరిచయం తర్వాత, మా అమ్మ బెడ్ మీద పడుకొని ఉంది, ఆమెకు అది చివరి దశ..నేను చెప్పాను అప్పుడు, అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు, నా జీవితంలోకి మంచి వ్యక్తి వచ్చిందని. కాగా, ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story