యూనివర్సల్ కంటెంట్ ఇది.. అందరినీ ఆకర్షిస్తుంది.. సిద్ధార్థ్ కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్

by sudharani |
యూనివర్సల్ కంటెంట్ ఇది.. అందరినీ ఆకర్షిస్తుంది.. సిద్ధార్థ్ కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్
X

దిశ, సినిమా: 2003 లో ‘బాయ్స్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్.. ఇప్పటికి అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం హీరోగా చేస్తూనే.. మరోవైపు పలు మూవీస్‌లో ఇంపార్టెంట్ రోల్స్‌లో దర్శనమిస్తున్నాడు. అయితే.. ఇటీవల ‘చిన్నా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసిన ఈయన.. ఇప్పుడు తన 40వ చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీకి ‘సిద్ధార్థ్ 40’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అరుణ్ విశ్వశాంతి టాకీస్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో దీన్ని రూపొందిస్తున్నారు.

ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘ఇది యూనివర్సల్ కంటెంట్. ఖచ్చితంగా ప్రతి ఆడియెన్స్‌కు నచ్చుతుంది. అన్ని వయసుల ప్రేక్షకులకు నచ్చేవిధంగా వారిని ఆకట్టుకునే సినిమా ఇది. యంగ్ టీమ్‌తో కలిసి వర్క్ చెయ్యడం నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఇందులో సిద్ధార్థ్ ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో స్టార్ట్ చేస్తాం. ఇతర నటీనటులచ, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed