ప్రేమలు నటుడి ఇంట తీవ్ర విషాదం.. తల్లిదండ్రుల పరిస్థితి బాధాకరం..

by Sujitha |
ప్రేమలు నటుడి ఇంట తీవ్ర విషాదం..  తల్లిదండ్రుల పరిస్థితి బాధాకరం..
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ ఆర్టిస్ట్ మాథ్యూ థామస్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లిదండ్రులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దగ్గరి బంధువు మృత్యువాతపడగా.. పేరెంట్స్ గాయాలతో బయటపడ్డారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ బంధువు దినకర్మకు హాజరై వస్తుండగా అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

మాథ్యూ సోదరుడు జాన్ జీపు డ్రైవ్ చేస్తుండగా.. శాస్తమునగల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న కాలువ గుంతలో పడింది. గాయాలైన తల్లిదండ్రులు బీజు, సునన్ లను ఎర్నాకులం ఆస్పత్రికి తరలించారు. కానీ వారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. కాగా లియోలో కీలకపాత్రలో కనిపించిన మాథ్యూ.. ప్రేమలు సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. సెకండ్ పార్ట్ లో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు.

Next Story

Most Viewed