Snake bite : పాము కాటు వేయగానే కంగారు వద్దు.. విషం శరీరానికి పాకకూడదంటే వెంటనే ఇలా చేయండి

by Dishafeatures2 |
Snake bite : పాము కాటు వేయగానే కంగారు వద్దు.. విషం శరీరానికి పాకకూడదంటే వెంటనే ఇలా చేయండి
X

దిశ, ఫీచర్స్ : సిటీలల్లో పాముల భయం అంతగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ అవి తక్కువగా ఉంటాయి. కొన్ని పరిసరాల్లో ఉన్నా జన సమూహంలోకి, ఇండ్లల్లోకి వచ్చే అవకాశం ఉండదు. కానీ గ్రామాల్లో, అటవీ సమీప ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి మాత్రం ఇప్పటికీ ఇదొక సమస్యగానే ఉంది. తమ తమ పనుల్లో నిమగ్నమయ్యే ప్రజలు తరచుగా పాము కాటుకు గురి కావడం, కొందరు చనిపోవడం వంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడంవల్ల ప్రాణహాని నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

* కొందరు పాము కరిచిన వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా మంత్రాలు, పుస్తకాలు చదవడం, నాటు వైద్యాన్ని అనుసరించడం చేస్తుంటారు. కానీ దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెప్తున్నారు. వైద్యం అందించడంలో ఆలస్యం అయితే విషం శరీరానికి పాకుతుంది. కాబట్టి పాము కాటు వేయగానే బాధితులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలి.

* పాము కాటు వేసిన ప్రాంతంలో రక్త స్రావం కావచ్చు. అలాగే దురదగా అనిపిస్తుంది. కానీ గోకడం, గిల్లడం వంటివి చేయకుండా ఓపికగా ఉండాలి. కొందరు పాము కరువగానే విషం పైభాగానికి ఎక్కకూడదని బ్యాండేజి వేస్తుంటారు. కానీ దీనివల్ల విషం ఒకేచోట గడ్డకట్టి గ్యాంగ్రీన్‌కు కారణం అవుతుంది. కాబట్టి తాడు, బట్ట, బ్యాండేజీ వంటి వాటితో కట్టకూడదు.

* పలువురు పాము కాటు వేసిన శరీర భాగంలో నోటి ద్వారా రక్తం/విషం పీల్చి బయటకు ఉమ్మివేయాలని చెప్తుంటారు. కానీ ఇది ప్రమాదకరం. ఎందుకంటే ఇలా చేయడంవల్ల విషం పీల్చినవారి నోటి నుంచి అది నేరుగా మెదడుకు చేరి ప్రాణహాని సంభవించవచ్చు.

* పాము కాటు వేయగానే విషం వెంటనే శరీరానికి పాకకుండా ఉండాలంటే ముందుగా బాధితులు ధైర్యంగా ఉండాలి. చుట్టు పక్కల వారికి ధైర్యం చెప్తూ ఏమీ కాదు అనే భరోసా ఇవ్వాలి. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ పెరగకుండా ఉంటుంది. అలాగే పాము కరిచిన చోట నీటితో కడగాలి. అలాగే కరిచిన పాము కనిపిస్తే వెంటనే దానిని ఫొటో తీసుకోండి. ఎందుకంటే దానిని డాక్టర్లకు చూపెడితే ఏ రకమైన విష సర్పమో గుర్తించడం ద్వారా చికిత్స అందించడం సులువవుతుంది. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే.. పాము కాటు వేయగానే బాధితున్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలి.

* పైవార్తలోని అంశాలు ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా సేకరించబడినవి. ఇవి పాఠకుల అవగాహన కోసం అందించిన కామన్ అండ్ ప్రమైరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. కాబట్టి అదనపు సమాచారం, అనుమానాలు, సందేహాల నివృత్తి కోసం వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Next Story

Most Viewed