జెడ్ సెక్యూరిటీ మధ్యలో ఆ అమ్మవారికి పూజలు.. కారణం ఏంటో తెలిస్తే షాక్..

by Sumithra |
జెడ్ సెక్యూరిటీ మధ్యలో ఆ అమ్మవారికి పూజలు.. కారణం ఏంటో తెలిస్తే షాక్..
X

దిశ, ఫీచర్స్ : మనదేశంలో కొలువై ఉన్న హిందూ ఆలయాల్లో ఒక్కోదానిలో ఒక్క ప్రత్యేకత దాగి ఉంది. అలాగే రాజస్థాన్‌లో కొలువైనా ఆలాయాల్లో అనేక సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. అందులో గంగౌర్ దేవి పూజ ఒకటి. వాస్తవానికి, రాజస్థాన్‌లోని ప్రతిచోటా గంగౌర్ దేవికి పూజలు చేస్తుంటారు. అయితే బికనీర్‌కు చెందిన ఈ గంగౌర్ పూజావిధానం మాత్రం వేరేలా ఉంది. అత్యంత పేరుగాంచిన ఈ గంగౌర్ మాతకు సాయుధ పోలీసులు భద్రత కల్పిస్తారు.

గంగౌర్ పండుగ అంటే ఏమిటి ?

గంగౌర్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని నిమార్, మాల్వా, బుందేల్‌ఖండ్, బ్రజ్ ప్రాంతాలలో జరుపుకునే పండుగ. ఇది చైత్ర మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. ఈ రోజున పెళ్లికాని అమ్మాయిలు, వివాహిత స్త్రీలు శివుడు, పార్వతిని పూజిస్తారు. ఇందులో పెళ్లికాని అమ్మాయిలు తమకు నచ్చిన భర్తను పొందాలని కోరుకుంటారు. అలాగే వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్షును కోరుకుంటారు.

గంగౌర్ కు విలువైన ఆభరణాలు..

ఈ గంగౌర్ మాత తల నుండి పాదాల వరకు బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలు ధరించి ఉంటుంది. అమ్మవారి వారి భద్రత కోసం సాయుధ పోలీసులను మోహరిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా విగ్రహానికి పోలీసులు గట్టి బందోబస్తులో నిమగ్నమై ఉంటారు. ఈ గంగౌర్‌ని తాకడానికి కూడా ఎవరికీ అనుమతి లేదు. ఈ గంగౌర్ మహిళల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మిగిలిపోతుంది.

కొడుకు కావాలని పూజ..

ఈ గంగౌర్‌ దేవిని దర్శించుకున్న తర్వాత పుత్రుడు కావాలనే కోరిక నెరవేరుతుందని అక్కడి భక్తుల నమ్మకం. కొడుకు పుట్టాలనే కోరికతో మహిళలు ఇక్కడికి వస్తుంటారు.

గంగౌర్‌ దేవికి సంబంధించిన ప్రత్యేకమైన కథ..

పురాణాల ప్రకారం బికనీర్‌కు చెందిన వడ్డీ వ్యాపారి ఉదయమాల్‌కు కొడుకు లేడని, దాని కోసం ఉదయమాల్ తన భార్యతో కలిసి కొడుకు కావాలనే కోరికతో రాజకుటుంబానికి చెందిన గంగౌర్‌ను పూజించాడు. కేవలం ఒక సంవత్సరం తర్వాత, ఉదయమాల్ భార్య చంద్మాల్ అనే కొడుకుకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఉదయమాల్, అతని భార్య గంగౌర్‌ను పూజించే అవకాశాన్ని సామాన్యులకు ఇవ్వడంతో పాటు బహిరంగంగా గంగౌర్‌ను పూజించడం ప్రారంభించారు. అప్పటి నుండి గంగౌర్ ఆరాధన చందమాల్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆ గంగౌర్‌ను చంద్‌మాల్ దద్ధా గంగౌర్ అని పిలుస్తారు.

Next Story

Most Viewed