ఇదేం పిచ్చిరా నాయనా.. రీల్స్ మీద ఇంట్రెస్ట్‌..నాలుగు కుటుంబాల్లో విషాదం!

by Mamatha |
ఇదేం పిచ్చిరా నాయనా.. రీల్స్ మీద ఇంట్రెస్ట్‌..నాలుగు కుటుంబాల్లో విషాదం!
X

దిశ,వెబ్‌డెస్క్: సెల్ఫీలు, రీల్స్ పిచ్చితో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. గతంలో ఈ పిచ్చితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది అయితే అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఇవి తెలిసి కూడా ప్రమాదకర చోట్లలో రీల్స్ చేస్తూ నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయి కుటుంబంలో విషాదం నింపారు. ఎంతో ప్రేమగా చూసుకున్న తమ తల్లిదండ్రులకు కన్నీటిని మిగిల్చారు. వివరాల్లోకి వెళితే.. బీహర్‌లోని ఖగారియా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగా నదిలో రీల్స్ చిత్రీకరించే క్రమంలో ప్రమాదవశాత్తూ ఆరుగురు యువకులు నీటిలో మునిగారు. ఇందులో నలుగురు యువకులు మృతి చెందగా..మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఖగారియా జిల్లాలోని పర్బట్టా పోలిస్‌స్టేషన్ పరిధిలోని అగువాని ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. యువతితో సహా ఆరుగురు రీల్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తూ చేపట్టారు. ఈ క్రమంలో ప్రమాదకర ప్రదేశాలలో రీల్స్, సెల్ఫీలు దిగొద్దని పోలీసులు సూచించారు.

Next Story

Most Viewed