ఉపాధి హామీ కూలీల ట్రాలీ బోల్తా.. ఆరుగురి పరిస్థితి విషమం, 20 మందికి గాయాలు

by Shiva Kumar |
ఉపాధి హామీ కూలీల ట్రాలీ బోల్తా.. ఆరుగురి పరిస్థితి విషమం, 20 మందికి గాయాలు
X

దిశ, మంచిర్యాల: ఉపాధి హామీ కూలీల ట్రాలీ బోల్తా పడిన ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దండేపల్లి శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనుల కోసం సుమారు 30 మంది కూలీలను ట్రాలీలో వెళ్తున్నారు. మధ్యాహ్నం పనులు ముగించుకుని ఇళ్లకు తిరిగి వస్తుండగా ట్రాలీ అదుపుతప్పి పక్కనే ఉన్న కడెం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్ం ఆరుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయాలైన వారిని లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

Next Story

Most Viewed