JEE Mains 2024: జేఈఈ మెయిన్ (సెష‌న్-2) ఫైనల్ కీ విడుద‌ల‌..

by Disha Web Desk 14 |
JEE Mains 2024: జేఈఈ మెయిన్ (సెష‌న్-2) ఫైనల్ కీ విడుద‌ల‌..
X

దిశ, డైనమిక్ బ్యూరో: జేఈఈ మెయిన్ (సెష‌న్-2) 2024 ప‌రీక్ష‌ల ఫైన‌ల్ కీ విడుద‌లైంది. ఈ మేరకు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్‌టీఏ) సోమ‌వారం తుది కీని విడుద‌ల చేసింది. ఈ ఫైనల్ కీని ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.inలో అందుబాటులోకి తెచ్చింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన జేఈఈ మెయిన్ సెష‌న్-2 ప‌రీక్ష‌కు దేశ వ్యాప్తంగా 12.57 ల‌క్ష‌ల మంది రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. అయితే షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్ 25న జేఈఈ మెయిన్ ఫ‌లితాలు వెల్ల‌డించాల్సి ఉన్న‌ప్ప‌టికీ అంత‌క‌న్నా ముందే విడుద‌ల చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు సమాచారం. రెండు సెష‌న్ల‌కు కలిపి హాజ‌రైన విద్యార్థుల మార్కులను భట్టి మెరిట్ లిస్ట్‌ను విడుదల చేయనున్నారు.

జేఈఈ మెయిన్‌లో మెరిట్ ఆధారంగా క్వాలిఫై అయ్యే 2.50 ల‌క్ష‌ల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష రాసేందుకు వీలును క‌ల్పిస్తారు. ఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌కు ఏప్రిల్ 27 నుంచి మే 7 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు. మే 17 నుంచి 26 వ‌ర‌కు అడ్మిట్ కార్డుల‌ను అందుబాటులో తెస్తారు. మే 26న ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్- 1 ప‌రీక్ష‌, మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్- 2 ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌ను జూన్ 9 వ తేదీన ప్ర‌క‌టించ‌నున్నారు.



Next Story

Most Viewed