పెరిగిన వడ్డీని ఖాతాదారుల అకౌంట్లో జమ చేస్తున్న EPFO

by Disha Web Desk 17 |
పెరిగిన వడ్డీని ఖాతాదారుల అకౌంట్లో జమ చేస్తున్న EPFO
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచిన విషయం తెలిసిందే. అయితే పెరిగిన వడ్డీని ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయడం మొదలుపెట్టినట్లు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) బుధవారం తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేసిన ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లకు పెరిగిన వడ్డీని కేటాయించే పనిని ప్రారంభించినట్లు, అతి త్వరలో ఖాతాదారులు తమ అకౌంట్లలో పెరిగిన వడ్డీ తాలుకు అమౌంట్‌ను చూస్తారని పేర్కొంది.

ఇప్పటికే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 28.17 కోట్ల మంది సభ్యుల బ్యాంకుల ఖాతాలకు వడ్డీని జమ చేసినట్లు సంస్థ తెలిపింది. ఒకవేళ నిధులు పొందడంలో సమస్య ఉన్నట్లయితే http://epfigms.gov.inలో నమోదు చేయాలని X లో పేర్కొంది. ఈపీఎఫ్‌ఓ అకౌంట్లపై సాధారణంగా వడ్డీ రేటు 8.15 శాతం ఉండగా, దానిని గత ఏడాది 8.25 శాతానికి పెంచారు. గత వారం, ఫిబ్రవరి 2024లో నికర ప్రాతిపదికన 15.48 లక్షల మంది సభ్యులు చేరారని, వారిలో సుమారు 7.78 లక్షల మంది సభ్యులు మొదటిసారిగా నమోదు చేసుకున్నారని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ తెలిపింది.



Next Story

Most Viewed