ఏపీలో పెరుగుతున్న పింఛన్‌ మరణాలు.. సీఎస్‌పై చంద్రబాబు ఆగ్రహం

by Disha Web Desk 16 |
ఏపీలో పెరుగుతున్న పింఛన్‌ మరణాలు.. సీఎస్‌పై చంద్రబాబు ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: పింఛన్ల పంపిణీ ఆలస్యం, వృద్ధుల మరణాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడుతున్న ఇబ్బందులపై సీరియస్ అయ్యారు. సకాలంలో పూర్తిగా అందించే అవకాశం ఉన్నా రాజకీయ కుట్రలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సీఎస్ జవన్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల ముందు పింఛన్ దారులను వేధించి అధికార వైసీపీకి లబ్ధి చూకూర్చేలా వ్యవహరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేవారు. ప్రభుత్వ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, పింఛన్ దారులకు ఇబ్బందులు కలిగేలా నిర్ణయాలు తీసుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. మండుటెండల్లో పెన్షన్ దారులను బ్యాంకులు చుట్టూ తిప్పుతూ నరకయాతన చూపిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పేదల ప్రాణాలతో రాజకీయం చేయొద్దని సూచించారు. పింఛన్ పేరుతో మారణ హోమాన్ని సృష్టిస్తున్నారని, ఏ1గా జగన్, ఏ2గా సీఎస్ అని చంద్రబాబు ఆరోపించారు. వెంటనే పింఛన్‌దారులకు ఇంటి వద్దనే నగదు పంపిణీ చేయాలని చంద్రబాబు లేఖలో డిమాండ్ చేశారు.

Read More..

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌‌పై చంద్రబాబు సంచలన నిర్ణయం

Next Story

Most Viewed