2024 Elections: నిరుద్యోగులు, ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్

by Disha Web Desk 16 |
2024 Elections:  నిరుద్యోగులు, ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులు, ఉద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ ప్రకటించారు. ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు, టీచర్లకు ఆయన లేఖ రాశారు. తాము అధికారంలోకి వస్తే డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందిస్తామని చెప్పారు. సకాలంలో జీతాలు, పింఛన్లు అందజేయడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. ఖాళీ పోస్టులన్నింటిని భర్తీ చేస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగులు, పింఛన్లర్లు, టీచర్లు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉద్యోగులకు టీడీపీ, వైసీపీ ఏమి ఇచ్చిందో తెలుసన్నారు. ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం వేధించిందని, భయం గుప్పిట్లో నుంచి బయటకు రావాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఐదేళ్లుగా ఉద్యోగులు పడుతున్న బాధలను తాను స్వయంగా చూశానన్నారు. జీతాలు రాక చాలామంది ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు. హక్కుల కోసం ఉద్యోగులు పోరాటం చేస్తే ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందని మండిపడ్డారు. ఎప్పుడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని తీసుకొచ్చిందని విమర్శించారు. అదనపు పింఛన్ క్వాంటం తగ్గించి వృద్ధులను ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు

Next Story

Most Viewed